బాలికపై దాడి..గ్రామపెద్దపై కేసు !

బాలికపై దాడి..గ్రామపెద్దపై కేసు !
x
Highlights

ప్రేమ వ్యవహారంలో మైనర్లను చితకబాదిన ఘటనలో గ్రామపెద్దను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో గ్రామ పెద్దను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

ప్రేమ వ్యవహారంలో మైనర్లను చితకబాదిన ఘటనలో గ్రామపెద్దను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో గ్రామ పెద్దను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కేపీదొడ్డిలో మైనర్లను చితకబాదిన గ్రామపెద్ద లింగప్పపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను ప్రేమించిన బాలుడి పైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లింగప్పను అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మైనర్లు ప్రేమించుకున్నారని ఆరోపిస్తూ వారిద్దరిపై విచక్షణారహితంగా గ్రామ పెద్ద దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై డీఎస్పీ వెంకటరమణ మైనర్ బాలిక ఇంటివద్ద విచారణ చేపట్టారు.

మైనర్ బాలికను కొట్టే సమయంలో రచ్చబండపై ఉన్నవారిని కూడా విచారించి వారిపైనా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మరోవైపు బాధితురాలికి న్యాయం జరగాలంటూ ఉదయం నుంచి వివిధ దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులపై ఇలాంటి హేయమైన చర్య చేపట్టినవారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories