JC Prabhakar Reddy: జేసీ నివాసం వద్దకు పోలీసులు.. తాడిపత్రిలో ఉద్రిక్తత

Police at JC Prabhakar Reddy House
x

JC Prabhakar Reddy: జేసీ నివాసం వద్దకు పోలీసులు.. తాడిపత్రిలో ఉద్రిక్తత

Highlights

JC Prabhakar Reddy: ఇంటి దగ్గర జేసీని అడ్డుకునేందుకు పోలీసుల ప్లాన్‌..

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువులో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వద్ద కళ్యాణ మండపం పనులు చేపట్టేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. ఆలయ అభివృద్ధికి నిధులు కొరత ఉండడంతో కళ్యాణమండపం నిర్మించడానికి ఆయన సిద్ధమయ్యారు. అనంతరం ఆలయంలో అభివృద్ధి తామే చేస్తామని వైసీసీ నాయకులు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట వద్దని కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవద్దని హైకోర్టు స్టే ఇచ్చింది.

రూ. ఐదు లక్షల లోపు ఆదాయం వచ్చే ఆలయాలు దేవాలయ శాఖ పరిధిలోకి రావని, అలాంటి ఆలయాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే అధికారుల అనుమతి అవసరం ఉండదని జేసీ వర్గీయులు చెబుతున్నారు. ఆ కారణంతోనే కళ్యాణ మండపం భూమి పూజకు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వజ్రగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ధర్మకర్తను పోలీసులు జూటూరులో హౌస్ అరెస్ట్ చేశారు. తిమ్మన చెరువు గ్రామానికి వెళ్లకుండా తాడిపత్రిలో జెసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జేసీ ఇంటివద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. జెసీ ప్రభాకర్‌రెడ్డిని ఆలయానికి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories