దారి దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

దారి దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
x
సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఎస్ కె ఖాజావలి
Highlights

దారి దోపిడీ చేసి పరారైన ముగ్గురు నిందితులను, అరెస్ట్ చేసినట్లు కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఎస్ కె ఖాజావలి తెలిపారు.

ముత్తుకూరు: మండలంలో నేలటూరు ఎపి జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగి జి.వెంకటనారాయణ రెడ్డి వద్ద నుండి సెల్ ఫోన్, 1000రూపాయలు దారి దోపిడీ చేసి పరారైన ముగ్గురు నిందితులను, అరెస్ట్ చేసినట్లు కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఎస్ కె ఖాజావలి తెలిపారు.

శుక్రవారం ముత్తుకూరులోని సిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13 తేది రాత్రి నారాయణ రెడ్డి, జెన్ కో క్వార్టర్స్ వద్ద నుండి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ నడిచి వెళ్తుండగా, నిందితులు మీనం గారి హరి పర్యవేక్షణలో కొండూరు మల్లికార్జున, అరవ వినోద్ లు అతనిని అడ్డగించి, కొట్టి సెల్ ఫోన్, వేయి రూపాయలు నగదును దోపిడీ చేసుకు పోయినట్లు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో దర్యాప్తు చేపట్టిన సిఐ ఖాజావలి, కృష్ణపట్నం ఎస్ఐ శివ కృష్ణారెడ్డి, ముత్తుకూరు ఎస్ఐ అంజిరెడ్డిలు సిబ్బంది తో రిలయన్స్ పవర్ ప్లాంట్ వద్ద సదరు నిందితులు కనిపించడంతో అరెస్ట్ చేసినట్లు వివరించారు. వీరి వద్ద నుంచి 10 వేల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్,టివిఎస్ ఎక్స్ ఎల్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నేరస్తులను పట్టుకొని, దోపిడీ చొత్తును స్వాధీనం చేసుకొనుటలో ప్రతిభ కనబరిచిన అధికారులను, కృష్ణపట్నం సర్కిల్ సిబ్బందిని రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి అభినందించి, రివార్డులకు సిఫార్స్ చేసినట్లు సిఐ ఖాజావలి వెల్లడించారు. ఈ సమావేశంలో కృష్ణపట్నం ఎస్ఐ శివ కృష్ణారెడ్డి, ముత్తుకూరు ఎస్ఐ అంజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories