విశాఖలో భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు..

విశాఖలో భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు..
x
Highlights

విశాఖలో భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు.. విశాఖలో భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు..

పోలీసులు, స్వచ్చంధ సేవా సంస్థలు ఎంత ప్రయత్నించినా వ్యభిచార ముఠాల ఆగడాలు ఆగడం లేదు. ఇటీవల ఉత్తరభారతదేశంలోని పలు చోట్ల సెక్స్ రాకెట్ దందాలను ధ్వంసం చేసి.. వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేసినా నిర్వాహకులకు భయం లేదు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ భారీ సెక్స్ రాకెట్ ను పోలీసులు ధ్వసం చేశారు. విశాఖ నగరం మురళీనగర్‌ కంచరపాలెం వద్ద ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం సాయంత్రం ఆ గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళా నిర్వాహకులు, కొంతమంది యువతులు, ఒక విటుడిని అరెస్ట్‌ చేసినట్టు సమాచారం. వారి వద్ద నుంచి రూ. 5300 నగదు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసు​కున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మహిళా నిర్వాహకులు డబ్బులకు ఇబ్బందులు పడే మహిళలను తీసుకువచ్చి వారిచేత వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వీరే కాక యాచక వృత్తి చేస్తున్న మహిళలను సైతం ఈ రొంపిలోకి దింపుతున్నారు. తద్వారా వేలాది రూపాయలు అర్జిస్తున్నారు. వీళ్ళ మూలానా స్థానికంగా నివాసముండే సాధారణ ప్రజలకు ఏవగింపు కలుగుతోంది. ఆ ప్రదేశంలో తిరగాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి. కొంతకాలంగా వీరి చేష్టలతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దాడి చేసి వారందరిని అరెస్ట్ చేశారు. ఇకనుంచి ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories