Tirupathi: తిరుపతిలో నల్లరిబ్బన్లతో నిరసనకు దిగిన సీపీఐ నేతలు
* సదరన్ జోన్ కౌన్సిల్ సమావేశానికి వ్యతిరేకంగా నిరసనలు * అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు
తిరుపతిలో సీపీఐ నేతల ఆందోళనలు(ఫైల్ ఫోటో)
Tirupathi: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతిలో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. దక్షిణ జోనల్ సమావేశాన్ని నిరసిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నల్లజెండాలతో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు తిరుపతిలో నారాయణను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తిరుపతిలోని సీపీఐ పార్టీ కార్యాయలలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లతో నిరసనకు దిగారు. దీంతో సీపీఐ నేతలను అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Next Story




