చేబ్రోలు ప్రజలకు పోలీస్ వారి ముఖ్య విజ్ఞప్తి

చేబ్రోలు ప్రజలకు పోలీస్ వారి ముఖ్య విజ్ఞప్తి
x
CI Srinivasa rao
Highlights

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని చేబ్రోలు సీఐ టి.వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

చేబ్రోలు: ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని చేబ్రోలు సీఐ టి.వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఒకేచోట గుమిగూడి తిరిగినట్లయితే ఈ వైరస్ తొందరగా వ్యాపిస్తుందన్నారు. కనుక పాఠశాలలు, కళాశాలలు‌, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఉపాధి హామీపథకం పనులు, ఇతరత్రా పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధలో ఉండాలన్నారు. లేదంటే విదేశాల్లో జరిగినట్లు మన దేశంలో కూడా వైరస్ పెరిగి శవాల కుప్పలు కుప్పలగా మారే అవకాశం కలిగించవద్దని మనవి చేశారు.

అందుకే ఎవరి ఇంట్లో వారే ఉండి ఈ వైరస్ ను మన దేశం నుంచి తరిమికొట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ వైరస్ గురించి మీరు మీ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేయాలన్నారు. ప్రభుత్వం 144 సెక్షన్ కూడా విధించిందన్నారు. ఎవరైనా ఎక్కడైనా గుంపులు గుంపులగా కనబడితే 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్నారు. 21 రోజులు ఇంట్లో ఉండండి, సంపాదన లేకపోతే పోయేదేమీ లేదన్నారు. బయట పనులకు పోతే చావు మనకు మనంగా గ్రామంలోకి తేచ్చి అందరం చనిపోయే అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ తీవ్రతపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి కట్టడి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories