పోలవరం ప్రాజెక్టు : కాలేశ్వరం నిపుణులను తీసుకువచ్చి..

పోలవరం ప్రాజెక్టు : కాలేశ్వరం నిపుణులను తీసుకువచ్చి..
x
Highlights

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా మారిన నీటిని తొలగిస్తోంది. జెట్ స్పీడ్‌లో...

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా మారిన నీటిని తొలగిస్తోంది. జెట్ స్పీడ్‌లో ప్రాజెక్ట్ ఏరియాలో నిల్వ నీటిని తొలగించే పనిని సిబ్బంది నిర్వహిస్తుండగా, పోలవరం నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి మేఘా ఇంజనీర్లు సిద్ధమవుతున్నారు. స్పిల్‌వే, అలాగే కీలక నిర్మాణ ప్రాంతం నిల్వ నీటితో నిండిపోయింది. దాంతో మేఘా సంస్థ.. నీటిని త్వరితగతిన తొలగించడానికి తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన నిపుణులను నియమించింది. నీటిని వేగంగా త్రవ్వటానికి మోటార్లను ఏర్పాటు చేశారు. ఒకవైపు నీరు తోడుతుంటే మరోవైపు స్పిల్‌వేలోకి ఎగువనుంచి నీరు ప్రవేశిస్తుంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే తొలగించేందుకు మేఘా సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిర్మాణ భాగాల్లో, కీలకమైన స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో బురద మట్టి పేరుకుపోయింది. దాంతో యంత్రాల సహాయంతో మట్టిని తవ్వి తీస్తున్నారు.

కాగా పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ లో దక్కించుకుంది మేఘా సంస్థ.. ప్రధాన డ్యామ్, జల విద్యుత్ కేంద్రాల టెండర్‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ పనులకు రూ. 4 వేల 987 కోట్లను ఇనిషియల్ బెంచ్‌ మార్కు విలువగా ప్రభుత్వం నిర్ణయించింది. మేఘా సంస్థ 12.6 శాతం తక్కువకే కోట్ చేసింది. రూ. 4 వేల 358 కోట్లకు కోట్‌ చేసి L-వన్‌గా నిలిచింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629 కోట్లు లబ్ది చేకూరినట్టయింది. గతవారమే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించటానికి మేఘా సంస్థకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబు హాయంలో నామినేషన్ బేసిస్ మీద నవయుగ సంస్థకు పోలవరం ప్రాజెక్టుతో పాటుగా హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే రివర్స్ టెండరింగ్ లో భాగంగా నవయుగను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన పైన నవయుగ హైకోర్టును ఆశ్రయించగా.. గతంలో 'స్టే' ఇచ్చింది..

ఈ క్రమంలో గతవారం ఈ 'స్టే' ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. కొత్త కాంట్రాక్టర్‌ అయిన మేఘా సంస్థతో ఒప్పందానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్‌కు విలువ ఉండదన్న ఏజీ సదుద్దేశంతో నవయుగ పిటిషన్ దాఖలు చేయలేదని వాదించారు. అడ్వకేట్ జనరల్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు పోలవరం పనులపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులకు మార్గం సుగమం అయింది. గతవారమే పోలవరం ప్రాజెక్టుకు నవయుగ శంకుస్థాపన చేసింది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 50 శాతం పైగా పనులను మేఘా సంస్థ పూర్తి చేయనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories