logo

నేడు ఏపీకి ప్రధాని రాక.. ఆ పెద్ద ప్రకటన ఉంటుందా?

నేడు ఏపీకి ప్రధాని రాక.. ఆ పెద్ద ప్రకటన ఉంటుందా?
Highlights

నేడు ఏపీలో మరోసారి ప్రధాని మోడీ పర్యటించనున్నారు. విశాఖలో జరిగే సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్బంగా పొలిసు...

నేడు ఏపీలో మరోసారి ప్రధాని మోడీ పర్యటించనున్నారు. విశాఖలో జరిగే సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్బంగా పొలిసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధాని రాక సందర్బంగా ఎవరూ నిరసనలు తెలపకుండా ఉండేందుకు పోలీసులు జాగరత్తలు తీసుకున్తున్నారు. రెండు రోజుల ముందు విశాఖకు రైల్వే జోన్ ను కేటాయించారు ప్రధాని.. అయితే ఈ ప్రకటనను టీడీపీ వ్యతిరేకిస్తుంటే.. బీజేపీ, వైసీపీలు స్వాగతిస్తున్నాయి. ప్రధాని రాక సందర్బంగా మరో పెద్ద ప్రకటన కూడా ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు విశాఖ పర్యటనకు రానున్నమోడీకి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ లేఖలో నిన్న కేంద్రం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ పెద్ద బూటకంగా అభివర్ణించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనతో ఏపీ పట్ల మోడీ అక్కసు మరోసారి బయటపడిందన్న సీఎం 6,500 కోట్ల మేర నష్టం వాటిల్లేలా జోన్ ప్రకటన చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. స్థానిక డివిజన్ లేకుండా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లేకుండా జోన్ ఏర్పాటు దేశ చరిత్రలో ఎప్పుడూ లేదని, ఉత్తరాంధ్ర ప్రజలను మోడీ మరోసారి మోసం చేశారని విమర్శించారు.


లైవ్ టీవి


Share it
Top