అప్పట్లో దిశ కేసులో పిటిషన్.. ఇప్పుడు జగన్ ను దించెయ్యాలట..

అప్పట్లో దిశ కేసులో పిటిషన్.. ఇప్పుడు జగన్ ను దించెయ్యాలట..
x
Highlights

దాదాపు 30 క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్న సీఎం జగన్.. నీతి నిజాయితీగల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్..

దాదాపు 30 క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్న సీఎం జగన్.. నీతి నిజాయితీగల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణపై ఆరోపణలు చేశారని ఆక్షేపిస్తూ న్యాయవాదులు జి.ఎస్ మణి , ప్రదీప్ కుమార్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా జడ్జిపై ఆరోపణలు చేసిన సీఎం జగన్ ను పదవినుంచి తొలగించాలని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐ, సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. న్యాయవ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు ముఖ్యమంత్రి ఇలా చేశారని న్యాయవాదులు పిటిషన్ లో ఆరోపించారు.

గతంలో చీఫ్ జస్టిస్ కాబోయే వ్యక్తులపై కూడా ఆరోపణలు వచ్చాయని, కానీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవని ఆరోపించారు. కాగా న్యాయవాదులు జి.ఎస్ మణి , ప్రదీప్ కుమార్ యాదవ్ గతంలో కూడా హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని తప్పుబడుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో ఈ పిటిషన్ పెను దుమారాన్ని సృష్టించింది. మహిళా సంఘాలు వీరి పిటిషన్ పై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories