సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టింగ్‌.. యువకుడు అరెస్ట్‌

సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టింగ్‌.. యువకుడు అరెస్ట్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకర పోస్ట్ పెట్టినందుకు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకర పోస్ట్ పెట్టినందుకు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన రాజేష్‌ ఈ నెల 12న ఫేస్‌బుక్‌లో సీఎంపై అసభ్యకరమైన వీడియోను పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోను చూసిన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 59/19 యూ/505(2), 507, 153ఎ కింద కేసు నమోదు చేశారు. అనంతరం మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా నిందితుడికి రిమాండ్‌ విధించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories