Top
logo

మీ తల్లిదండ్రులు సంస్కారం నేర్పలేదా? పవన్ పై మంత్రి పేర్నినాని విమర్శలు

Perni nani
X
Perni nani
Highlights

ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంపై ఏపీలో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన జనసేన...

ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంపై ఏపీలో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేయగా పవన్‌పై మంత్రి పేర్నినాని కౌంటర్లు వేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మంచి పనులు పవన్‌ కళ్యాణ్‌కు కనిపించడం లేదని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ నడుచుకుంటున్నారని దుయ్యాబట్టారు. రైతు భరోసా, యువతకు ఉద్యోగ కల్పన, ఇలాంటి మంచి పనులు మీకు కనిపించలేదా అని పేర్నినాని ప్రశ్నించారు.

భవన నిర్మాణ కార్మికుల డబ్బులు దోచిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని పక్కన పెట్టుకుని, విశాఖలో భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందిన్నారు. పవన్‌ నాయుడులా మూడు పెళ్లిళ్లు ఎవరూ చేసుకోలేరని విమర్శించారు. జగన్ కు ప్రజాసేవ చేయానే తపన ఉందని అందుకే రాజకీయం చెస్తున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ సభలో సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, సభ రోజు మీ తల్లిదండ్రులు సంస్కారం నేర్పలేదా? సంస్కారం గురించి మీరు మాట్లాడితే వినాల్సివస్తుందని ఎద్దేవా చేశారు. వెంకయ్యనాయుడిని దారుణంగా తిట్టిన చరిత్ర పవన్ కళ్యాణ్ దని పేర్నినాని అన్నారు.

Next Story