Parameshwar Reddy: పిల్లలతో తిరుపతి వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలి

People Visiting Tirupati With Children Should Be Alert Says Parameshwar Reddy
x

Parameshwar Reddy: పిల్లలతో తిరుపతి వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలి

Highlights

Parameshwar Reddy: బాలుడిని కిడ్నాప్ చేసిన సుధాకర్‌ను అరెస్టు చేశాం

Parameshwar Reddy: తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన రెండేళ్ల బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. బాలుడు ఆరుల్ మురుగన్‌ను తల్లికి అప్పగించారు తిరుపతి పోలీసులు. సుధాకర్ అనే నిందితుడు.. బాబును బస్టాండ్‌లో అపహరించి, ఏర్పేడుకు తీసుకెళ్ళాడు. అక్కడ తన అక్క ధనమ్మకు అప్పగించాడు. అప్పటికే పోలీసులు అప్రమత్తం కావడం, అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేయడంతో బాబు కిడ్నాప్ గురించి తెలుసుకున్న ధనమ్మ వెంటనే సర్పంచ్ ద్వారా బాలుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. వారు ఎస్పీ ఆద్వర్యంలో తల్లికి అప్పగించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడుడి సుధాకర్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశామన్నారు ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి. పిల్లలతో తిరుపతి వచ్చే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కిడ్నాప్ వెనుక కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories