సెలవులకు క్యాంపు వెళ్ళేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి

సెలవులకు క్యాంపు వెళ్ళేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి
x
ఎస్ఐ విభీషణరావు
Highlights

రానున్న క్రిస్టమస్ మరియు సంక్రాంతి సెలవులు సందర్భంగా ఇల్లు విడిచి, వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ విభీషణరావు తెలిపారు.

పాయకరావుపేట: రానున్న క్రిస్టమస్ మరియు సంక్రాంతి సెలవులు సందర్భంగా ఇల్లు విడిచి, వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ విభీషణరావు తెలిపారు. పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండగలకు వేరే ఊరు వెళ్ళే వారు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందిస్తే, ఆ ఏరియాలో బీట్ సిబ్బందిని అప్రమత్తం చేస్తామన్నారు.

తమ విలువైన సొత్తును లాకర్లలో భద్రపరుచుకోవడం గానీ, లేదా తమ వెంటే తీసుకుని వెళ్ళడం ద్వారా దొంగ తనాలు నివారించవచ్చని తెలిపారు. అదే విధంగా తాము క్యాంపు వెళ్తున్న విషయం తమ ఇంటి ఇరుగుపొరుగు వారికి తెలియజేయడం ద్వారా అనుకోని సంఘటనలు జరినప్పుడు సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories