Visakhapatnam: కిరాణా కష్టాలు... గంటల కొద్దీ స్టోర్స్‌ ముందు క్యూ

Visakhapatnam: కిరాణా కష్టాలు... గంటల కొద్దీ స్టోర్స్‌ ముందు క్యూ
x
Highlights

విశాఖపట్నం నగరం కరోనా వైరస్‌ కారణంగా ప్రజలకు కిరాణా నష్టాలు మొదలయ్యాయి.

విశాఖపట్నం నగరం కరోనా వైరస్‌ కారణంగా ప్రజలకు కిరాణా నష్టాలు మొదలయ్యాయి.విశాఖపట్నం నగరం కరోనా వైరస్‌ కారణంగా ప్రజలకు కిరాణా నష్టాలు మొదలయ్యాయి.
గంటల కొద్దీ స్టోర్స్‌ ముందు క్యూ కట్టినా, సరుకులన్నీ లభ్యం కావడం లేదు. మిగిలిన సరుకుల కోసం వేరే దుకాణాల వద్ద క్యూ కట్టాల్సివస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నారు.

చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.డీమార్ట్‌, స్పెన్సర్స్‌, మోర్‌, రిలయన్స్‌ ఫ్రెష్‌, హెరిటేజ్‌లతో పాటు నగరంలో వందకు పైగా సూపర్‌మార్కెట్లు ఉన్నా సరుకులు ఇంటికి తెచ్చుకోవడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయాన్నే షాపులకు వెళ్లినా క్యూలైన్లలో నిలబడలేక తిరిగి వచ్చేస్తున్నారు. స్టోర్స్‌లోకి ఒకసారి పది మందిని మాత్రమే లోపలికి పంపుతున్నారు. వారు వచ్చేవరకూ బయట వేచి ఉండాల్సిందే. క్యూలైను కిలోమీటరు మేర ఉండటం, పదింటికే లోపలికి పంపకుండా ఆపేస్తుండటంతో చాలామంది వెనుదిరుగుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories