విశాఖ నుంచి పాలన.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

విశాఖ నుంచి పాలన.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
x
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Highlights

ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత పాలన పరిపాలన రాజధాని విశాఖ నుంచి ప్రారంభించవచ్చని పరోక్షంగా వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎం రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పాలన కొనసాగించ వచ్చని ఆ అధికారం ముఖ్యమంత్రి జగన్ కు ఉందని అభిప్రాయపడ్డారు.

మూడు రాజధానుల నిర్ణయం సరైందని పెద్దిరెడ్డి అన్నారు. పరిపాలన వికేంద్రీకరణకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శిచారు. దేనికైనా కొన్ని విధానాలు ఉంటాయని, అన్నీ పద్ధతి ప్రకారమే చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ విషయంలో కోర్టుల నుంచి కూడ అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వల్లే వైసీపీ ప్రభుత్వానికి ఇంత మంచి జనంలో మంచి స్పందన వస్తుందని తెలిపారు.

అయితే మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అయితే ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని దీంతో బిల్లులు మండలిలోనూ పాసయినట్టే అని వైసీపీ నేతలు అంటోన్నారు. దీంతో సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలనకు లైన్ క్లియర్ అయినట్టే అని ప్రచారం జరుగుతోంది. రాబోయే బడ్జే్ట్ సమావేశాలు అనంతరం విశాఖ నుంచి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు పెద్ద చర్చగా మారాయి.

అలాగే స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు గురి అవుతారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఉగాదిలోగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. స్థానికంగా నివాసం ఉండేలా సర్పంచ్‌లకు పలు నిబంధనలు రూపొందించాలని.., ఎన్నికలల్లో అలాగే డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చూసేలా ఎన్నికల నియమావళిని ఉంటుందని రామచంద్రరెడ్డి తెలిపారు


Show Full Article
Print Article
More On
Next Story
More Stories