పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
x
Highlights

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యయత్నం కలకలం రేపుతోంది. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది...

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యయత్నం కలకలం రేపుతోంది. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలకృష్ణన్ పై గత కొంతకాలంగా వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి విచారణ కమిటీ కూడా ఏర్పాటైంది. బాధితులు తమ సమస్యలను ఇవాళ విచారణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్బంగా బాలకృష్ణన్ తమను ఎలా వేధిస్తున్నారో చెప్పి వారు.. కమిటీ అధికారుల ముందే వాపోయారు. ఆయన వేధింపుల వల్లే మహిళా ఎక్సైజ్ ఎస్‌ఐ గీత ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. సూపరిటెండెంట్ బాలకృష్ణన్ పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం ఉండటం లేదని తమకు సరైన న్యాయం జరగడం లేదని బాధిత మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా ఎస్ఐ ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories