ఆయనను పార్టీలోకి ఆహ్వానించా : పవన్ కళ్యాణ్

ఆయనను పార్టీలోకి ఆహ్వానించా : పవన్ కళ్యాణ్
x
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పెంటపాటి పుల్లరావుపై ప్రశంసలు కురిపించడంతో పాటు ఆయన్ను జనసేన పార్టీలోకి...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పెంటపాటి పుల్లరావుపై ప్రశంసలు కురిపించడంతో పాటు ఆయన్ను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు పవన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన రాస్తున్న కథనాలు విశ్లేషణాత్మకంగా, ఆలోచింపజేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయనను జనసేనలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు. అలాగే

జనసేన లాంటి కొత్త పార్టీకి పుల్లారావు లాంటి అనుభవం ఉన్న వ్యక్తుల మార్గదర్శకత్వం అవసరముందని.. ఓసారి తామిద్దరం కలుసుకున్నామనీ, కొన్ని గంటల పాటు ఒకరి ఆలోచనలను మరొకరం పంచుకున్నామని అందులో పేర్కొన్నారు. జనసేనలో చేరాల్సిందిగా తాను పుల్లారావును ఒప్పించాననీ, ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories