Pawan Kalyan: ఇకపై ప్రతీ 2 నెలలకు ఒకసారి 3 రోజులు ఇక్కడే ఉంటా


Pawan Kalyan Manyam Tour: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పర్యటించి మరోసారి అక్కడి ప్రజల సమస్యలు అడిగి...
Pawan Kalyan Manyam Tour: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పర్యటించి మరోసారి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2018 లో తాను ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఇప్పటికీ రోడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ఆయన తెలుసుకున్నారు. వృద్ధులు కూడా మంచి నీటి కోసం నెత్తిపై బిందె పెట్టుకుని కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్తున్నట్లు ఓ వృద్ధురాలు అప్పట్లో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.
రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినా, లేక ఎవరైనా అనారోగ్యం బారినా పడినా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి స్థానికులు చెప్పారు. ఇప్పటికీ రోగులను మంచంపైనో లేక డోలీలోనో తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పుకుని వాపోయారు.
మన్యం పార్వతీపురం జిల్లా, మక్కువ మండలం, బాగుజోల గ్రామంలో రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన అనంతరం అక్కడ నుండి వర్షం వస్తున్నప్పటికీ, బురదలో చిలకల మండంగి వైపు కొండపైకి నడుచుకొంటూ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan, అక్కడి గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.… pic.twitter.com/4S5e9CNFmp
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 20, 2024
అప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో ఆ ప్రాంతంలో పర్యటించారు. పార్వతీపురం మన్యం జిల్లా బాగుజోలలో ( Pawan Kalyan in Bagujola) రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని బాగుజోల గ్రామంలో పర్యటనకి వెళుతున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారికి సాలూరు సమీపంలో స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వారితో మాట్లాడి, అనంతరం కాలినడకన వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.@AndhraPradeshCM… pic.twitter.com/IY95DWNwBj
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 20, 2024
పార్వతీపురం, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లోని 9 గిరిజన గ్రామాలకు ప్రత్యక్షంగా మేలు జరిగేలా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. పరోక్షంగా ఆ చుట్టు పక్కల ఉన్న మరెన్నో గ్రామాలకు కూడా ఈ రోడ్డు నిర్మాణం ఉపయోగపడుతుందంటున్నారు. రూ. 49.73 కోట్ల రూపాయలతో 48 కిమీ మేర ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.
He promised during 2018 porata yatra:
— 𝖦 𝖫 𝖠 𝖲 𝖲 𝖨𝖳 (@LetsGlassIt) December 20, 2024
“Miru vote lu vestaro veyaro anavasaram,
Manaspurthiga miku andaga unta”
Full filing his promise after power in 2024 pic.twitter.com/lFfmYrFFuc
పార్వతీపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఆయన పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో పవన్ కల్యాణ్ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ.. మీరు ఓట్లు వేసినా, వేయకపోయినా మీకు మనస్ఫూర్తిగా అండగా ఉంటానని అప్పట్లో మాటిచ్చారని, అలాగే ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ( Pawan Kalyan's Fans) అంటున్నారు. ఇకపై కూడా ప్రతీ 2 నెలలకు ఒకసారి మూడు రోజుల పాటు పార్వతిపురం మన్యం జిల్లాలో పర్యటించి ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ మరోసారి మాటిచ్చారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



