Top
logo

రేపు ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల చెక్కును అక్కడ అందజేస్తారు. ఇటీవల ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ కోటి విరాళం ప్రకటించారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు పవన్‌ ట్విట్టర్ ద్వారా ఇటీవల తెలిపారు.

ఈ మేరకు ఆ చెక్‌ను ఇవ్వనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేఘాలయ శాసనసభ స్పీకర్ మెత్బా లింగ్డో, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొంటారు.

Web TitlePawan Kalyan visit to delhi on tomorrow
Next Story


లైవ్ టీవి