Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌కు స్వల్ప అస్వస్థత

Pawan Kalyan sick in Bhimavaram Tour
x

Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌కు స్వల్ప అస్వస్థత

Highlights

Pawan Kalyan: వైద్యం అందిస్తున్న డాక్టర్లు.. సమీక్షా సమావేశాలు మధ్యాహ్నానికి వాయిదా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్వల్పంగా అస్వస్థతకు గురికావడంతో భీమవరం నిర్మల దేవి ఫంక్షన్ హాల్ లో జరగనున్న సమీక్ష సమావేశాలు వాయిదా పడినట్ట జనసేన నేత చంద్రశేఖర్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్రకు జనం నీరాజనాలు పడుతున్నారని ఆయన తెలిపారు. నరసాపురంలో జరిగిన బహిరంగ సభ ముగిసిన తరువాత భీమవరం వచ్చే రహదారి జనంతో నిండిపోయిందన్నారు.

పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకోవడానికి మూడు గంటలు పట్టిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. డాక్టర్ల సమక్షంలో వైద్యం అందుతుందన్నారు. ఉదయం జరగాల్సిన సమావేశాలు మధ్యాహ్నం ఒంటిగంట తరువాత జరుగుతాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories