Pawan Kalyan: పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడొద్దు

Pawan Kalyan Key Instructions for Party Leaders
x

Pawan Kalyan: పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడొద్దు

Highlights

Pawan Kalyan: పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడొద్దు

Pawan Kalyan: పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కీలక సూచనలు చేశారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా కామెంట్స్ చేయొద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామన్నారు పవన్‌కల్యాణ్. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో.. పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరారు.

పార్టీ విధానాలకు భిన్నంగా అభిప్రాయాలను ప్రచారం చేయొద్దని సూచించారు. ఇలాంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని అన్నారు. పొత్తులపై అభిప్రాయాలు, సందేహాలు ఉంటే.. తన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ దృష్టికి తేవాలని కోరారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ కార్యాలయానికి సూచించినట్లు పవన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories