Top
logo

ఇలా అయితే పోరాటం చేస్తాం : పవన్ కళ్యాణ్

ఇలా అయితే పోరాటం చేస్తాం : పవన్ కళ్యాణ్
Highlights

జగన్‌ 100 రోజుల పాలనపై 9 అంశాలతో 33 పేజీల నివేదికను విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .ఇందులో వైసీపీ...

జగన్‌ 100 రోజుల పాలనపై 9 అంశాలతో 33 పేజీల నివేదికను విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .ఇందులో వైసీపీ పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. ప్రజారోగ్యం పడకేసిందన్నారు. సీజన్‌ వ్యాధుల నివారణలోను ప్రభుత్వం విఫలమైందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అమరావతిపై ప్రభుత్వంలోని పెద్దలు తలో మాట మాట్లాడుతూ సందిగ్ధంలో పడేశారని విమర్శించారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశమన్నారు. నూతన ఇసుక పాలసీలో సైతం అవినీతి జరుగుతుందన్నారు. పాలన ఇలాగే సాగితే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు పవన్.

Next Story

లైవ్ టీవి


Share it