వైసీపీ సర్కార్ చర్యల వల్ల బలైపోయేది ఉద్యోగులే

వైసీపీ సర్కార్ చర్యల వల్ల  బలైపోయేది ఉద్యోగులే
x
Highlights

అమరావతి నుంచి కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ స్పందించారు. ప్రభుత్వం ఓట్లు వేసిన...

అమరావతి నుంచి కర్నూలుకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ స్పందించారు. ప్రభుత్వం ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. వైసీపీ సర్కార్ దొడ్డి దారి జీవోలు ఆపాలని హితవు పలికారు. అర్థరాత్రి సమయంలో జీవో నెంబర్ 13 జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్స్ కార్యాలయాలను తరలిస్తూ జీవో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు వంటి చర్యల వలన ఉద్యోగులు బలైపోతారని అన్నారు. సచివాలయం ఆధ్వర్యంలో పనిచేయాల్సిన విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా తరలించడం వల్ల కోర్టు కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటామోనని ఉద్యోగులు భయపడుతున్నారని, ఓ కీలక అధికారి సెలవు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోందని అన్నారు. దీని బట్టి ఉద్యోగులు ఎంత అభద్రతా భావంలో ఉన్నారో అర్థమవుతోందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories