Pawan Kalyan: బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాలు గెలిచింది

Pawan Kalyan: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేనాని

Samba Siva Rao
Published on: 14 March 2021 5:10 PM IST
Pawan On Municipal ELections
X

పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో

Pawan Kalyan: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కేవలం బెదిరింపులతోనే అధికార వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుందని ఆరోపించారు. రేషన్ కార్డులు, పింఛన్లు, విద్యా పథకాలు ఆపేస్తామని వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అధికార వైసీపీ భరోసా ఇచ్చి ఓట్లు సాధించలేదన్న పవన్.. ఓటర్ల కడుపు మీద కొట్టి, తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించారని మండిపడ్డారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. వైసీపీకీ ప్రజలు పట్టం కట్టారు. మొత్తం 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏలూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగినా హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ చేపట్టలేదు. ఇక, పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్లలో ఏకగ్రీవాలు కావడంతో మిగిలిన 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైసీపీ భారీ విజయాల్ని నమోదు చేసింది. దాంతో, రాష్ట్ర చరిత్రలోనే ఈ ఎన్నికలు ఓ రికార్డుగా నిలవబోతున్నాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story