ఎవడు అడ్డం వచ్చిన వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

ఎవడు అడ్డం వచ్చిన వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
x
pawan kalyan
Highlights

రాయలసీమ పర్యటనలో జనసేనాని బీజీగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైనా విమర్శలు ఎక్కుపెట్టారు.

రాయలసీమ పర్యటనలో జనసేనాని బీజీగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే మదనపల్లి మార్కెట్‌లో రైతులతో మాట్లాడేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మార్కెట్‌లోకి అనుమతి ఇవ్వకపోతే రోడ్డు మీద కూర్చోని మాట్లాడుతానన్నారు. ఎవడు అడ్డం వచ్చిన వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వైసీపీ నాయకులకు భయపడి చేతులు ముడుచుకుని కూర్చోమన్నారు. రాయలసీమలో పరిశ్రమలు పెట్టేవారిని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

గురువారం మదనపల్లిలో పర్యటించబోతున్న పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు అక్కడి రైతులు. మదనపల్లి మార్కెట్ యార్డులో రైతాంగంతో సమావేశం కానున్నారు. ‎ఈ నేపథ్యంలో తమ మార్కెట్ యార్డు ఆవరణలోకి రావద్దంటూ పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories