షరతుల్లేకుండా పవన్‌ ముందుకొచ్చారు... 2024 అధికారమే లక్ష్యంగా మా ప్రయాణం : కన్నా

షరతుల్లేకుండా పవన్‌ ముందుకొచ్చారు... 2024 అధికారమే లక్ష్యంగా మా ప్రయాణం : కన్నా
x
కన్నా లక్ష్మీనారాయణ
Highlights

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు సమావేశం అనంతరం...

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తమతో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముందుకొచ్చారని అన్నారు.

ఎలాంటి షరతుల్లేకుండా తమతో కలిసి పనిచేయడానికి పెద్దమనసుతో పవన్‌ ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. విభజన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సామాజిక న్యాయం సాధించాలన్నా బీజేపీ-జనసేనతోనే సాధ్యమన్నారు. రెండు పార్టీలూ 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కలిసి పోరాటం చేస్తామన్నారు. వైసీపీ నియంతృత్వ వైఖరిపై గతంలో టీడీపీ చేసిన అవినీతిపై కలిసి పోరాడతామని కన్నా ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories