logo

కర్నూల్ జిల్లాలో పట్టాలు తప్పిన రైలు

కర్నూల్ జిల్లాలో పట్టాలు తప్పిన రైలు

కర్నూల్ జిల్లాలో రైలు పట్టాలు తప్పింది. చిత్తూరు నుంచి కాచిగూడ వెళుతున్న వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. అప్రమత్తమైన సిబ్బంది రైలును వెంటనే నిలిపివేశారు. ప్రస్తుతం ఇంజనుకు మరమత్తులు జరుసుగుతునట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి 2:30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్‌ రైలు కూడా పట్టాలు తప్పడం గమనార్హం.

లైవ్ టీవి

Share it
Top