Annavaram: జగన్ నవరత్నాలను హేళన చేసిన వారికి గుణపాఠం

Annavaram: జగన్ నవరత్నాలను హేళన చేసిన వారికి గుణపాఠం
x
Highlights

శంఖవరం గ్రామంలో జరిగిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు దీవెన కార్డుల పంపిణీ, బహిరంగ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

అన్నవరం: జగన్ పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలను తొమ్మిది గులకరాళ్లతో పోల్చిన తెలుగుదేశం నాయకులకు ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చి, హామీ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ డబుల్ నవరత్నాల ద్వారా తగిన బుద్ధి చెప్పారని ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్రప్రసాద్ పేర్కొన్నారు.

శంఖవరం గ్రామంలో జరిగిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు దీవెన కార్డుల పంపిణీ, బహిరంగ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నియోజకవర్గ 4 మండలాల విద్యాశాఖ అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులు ఈ సభలో పాల్గొని జగన్ ప్రభత్వం చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో తాము భాగస్వామ్యులైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories