Parliament Sessions: ప్రత్యెక హోదా..విద్యుత్ బిల్లులు.. పార్లమెంట్ లో తెలుగు రాష్ట్రాల ప్రాధమ్యాలు!

Mithun Reddy and Nama Nageswararao (File Photo)
Parliament Sessions | రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించే వివిధ అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల లోక్ సభా పక్షాలు ప్రణాళికలు.
Parliament Sessions | రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించే వివిధ అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల లోక్ సభా పక్షాలు ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఏపీకి సంబంధించి ప్రధానంగా ప్రత్యేక హోదా, తెలంగాణాకు సంబంధించి వివిధ పెండింగ్ బిల్లులు అమోదంతో పాటు నూతన విద్యుత్ బిల్లుపై ప్రస్తావించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
సోమవారం నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నుంచి ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. భేటీ అనంరతం ఆయన వివరాలను వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్ కోరినట్లు తెలిపారు. నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై కూడా చర్చించాలని కోరినట్లు వెల్లడించారు. అవకాశం వచ్చినా ప్రతిసారి ప్రత్యేక హోదా అంశాన్ని లెవనెత్తుతూనే ఉంటామని, ప్రత్యేక హోదా అంశంపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరగబోతున్నాయని అన్నారు. ఇక ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందన్నారు. విపక్షాలకు అంశాలు లేక తమపై అనవసరమైన నిందలు వేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్ మీటర్ల విషయంలో ఎవరు ఆందోళనలో చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశాని మిథున్ రెడ్డి గుర్తుచేశారు.
విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తాం: నామా
పెండింగ్ బిల్లులు ఆమోదించుకోవడమే లక్ష్యంగా అజెండా రూపొందించారు. జీఎస్టీ పెండింగ్ నిధులు, కరోనా, వలస కార్మికుల సమస్యలు, నిరుద్యోగం, సరిహద్దు వివాదాలు, ఆర్థిక ప్రగతిపై కూడా చర్చించాలని కోరాం. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తుతాం. 11 ఆర్డినెన్స్ లు కేంద్రం ప్రవేశ పెట్టబోతోంది. ఈ సమావేశాల్లో మొత్తం 25 బిల్లులు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రజావ్యతిరేక బిల్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో నూతన విద్యుత్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. దాన్ని వ్యతిరేకిస్తాం. నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
YCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ
29 Jun 2022 8:10 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTవిజయ్ దేవరకొండ తో మూడో సినిమా ప్లాన్ చేస్తున్న పూరి
29 Jun 2022 7:33 AM GMTRation Card: వారి రేషన్‌కార్డులు రద్దవుతున్నాయి.. మీరు ఆ లిస్ట్‌లో...
29 Jun 2022 7:31 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల...
29 Jun 2022 7:16 AM GMT