టాయిలెట్స్‌ వద్ద పసికందును వదిలి వెళ్లిన తల్లిదండ్రులు..

టాయిలెట్స్‌ వద్ద పసికందును వదిలి వెళ్లిన తల్లిదండ్రులు..
x
Highlights

పెళ్ళైనా సంతానలేమితో బాధపడుతున్న ఆడవాళ్లు ఎందరో ఉన్నారు. వారి బాధ వర్ణనాతీతం అయితే.. గర్భందాల్చి పిల్లల్ని కని పెంచలేక అమ్ముకుంటున్న వారు కూడా కోకొల్లలు

పెళ్ళైనా సంతానలేమితో బాధపడుతున్న ఆడవాళ్లు ఎందరో ఉన్నారు. వారి బాధ వర్ణనాతీతం అయితే.. గర్భందాల్చి పిల్లల్ని కని పెంచలేక అమ్ముకుంటున్న వారు కూడా కోకొల్లలు. మరి కొంతమంది పుట్టింది ఆడశిశువైతే మాత్రం చెత్తకుప్పల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో వదిలి వెళుతున్నారు. తాజాగా ఆడ శిశువనో.. పెంచేందుకు భారమనో రైల్లో ఆడబిడ్డను వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన తిరుపతి రైల్వే స్టేషన్‌లో వెలుగులోకి వచ్చింది. తిరుపతికి మధ్యాహ్నం కోయంబత్తూరు నుంచి ఓ రైలు వచ్చింది. ప్రయాణికులు అందరూ దిగి వెళ్లారు.. ఇంతలో పారిశుధ్య కార్మికులు బోగీలను శుభ్రం చేయడానికి రైలు ఎక్కారు. ఓ బోగీలో పసికందు ఏడుపు వినిపించింది.

దాంతో అటు ఇటు చూడగా టాయిలెట్స్‌ వద్ద నెలరోజుల వయస్సు ఉన్న ఓ ఆడశిశువు కనిపించింది. ఎవరో కావాలనే అక్కడ వదిలేసి వెళ్లారని గ్రహించారు. వెంటనే ఆ పసికందును ఎత్తుకుని లాలించారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి రైల్వే స్టేషన్ కు చేరుకొని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. మరోవైపు ఆ పసికందు తల్లిదండ్రులున్నారేమోనని స్టేషన్‌ ప్రాంతం మొత్తం గాలించారు. మైక్‌లో కూడా అనౌన్స్‌మెంట్‌ చేసినా ఫలితం లేదు. ఇక చేసేదేమీ లేక చిత్తూరులోని బాలల సంరక్షణ సమితి నిర్వాహకులకు అప్పగించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories