వైసీపీలోకి టీడీపీ నేత.. దగ్గుబాటి దూరం!

వైసీపీలోకి టీడీపీ నేత.. దగ్గుబాటి దూరం!
x
Highlights

వైసీపీలోకి టీడీపీ నేత.. దగ్గుబాటి దూరం! వైసీపీలోకి టీడీపీ నేత.. దగ్గుబాటి దూరం!

పర్చూరు టీడీపీ నేత రావి రామనాథం బాబు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రామనాథం బాబు మాట్లాడుతూ... విశాల హృదయంతో తమను సీఎం జగన్‌ పార్టీలో చేర్చుకున్నారని, వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. ఇదిలావుంటే రామనాథం బాబు వైసీపీలో చేరిన సమయంలో పర్చూరు వైసీపీ ఇన్ ఛార్జ్ దగ్గుబాటి హితేష్ చెంచురామ్ కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ లేరు. వాస్తవానికి రామనాథం బాబు గత ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. అప్పటివరకు వైసీపీలోనే ఉన్నారు. అయితే దగ్గుబాటికి సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ఆయన టీడీపీలో చేరారు.

ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన దగ్గుబాటి ఆ తరువాత వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రామనాథం బాబు చేరికతో ఆయన అసంతృప్తి మరింత పెరిగిందని అంటున్నారు నియోజకవర్గ వాసులు. ప్రస్తుతానికి దగ్గుబాటి హితేష్ చెంచురామ్ వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నా సమాంతరంగా రామనాథం బాబును తీసుకురావడంపై దగ్గుబాటి అనుచరులు కినుక వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా రామనాథం బాబు చేరికకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ముఖ్య భూమిక పోషించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories