ఏపీలో రేపటి నుంచి రెండో విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ

ఏపీలో రేపటి నుంచి రెండో విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ
x
Highlights

*18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో జరగనున్న ఎన్నికలు *ఫిబ్రవరి 4న వరకు నామినేషన్ల దాఖలుకు తుదిగడువు *ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 175 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 4న తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎస్ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన, ఆరో తేదీన నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన, ఏడవ తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 8లోగా నామినేష్లు ఉపసంహరించుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 13న పోలింగ్.. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు., ఫలితాల వెల్లడి ఉంటుందని ఎన్నికలసంఘం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories