ఏపీలో గందరగోళంగా మారిన పంచాయితీ పోరు

ఏపీలో గందరగోళంగా మారిన పంచాయితీ పోరు
x

పంచాయితీ పోల్స్  ఏపీ 

Highlights

*రేపటి సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోంది..? *చిత్తూరు జిల్లాలో పంచాయితీ ఎన్నికలపై నీలినీడలు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల వ్యవహారం గందరగోళంగా మారింది. చిత్తూరు జిల్లాను ఈ పరిణామం అయోమయానికి గురి చేస్తోంది. 66 మండలాలు కలిగిన ఈ జిల్లాలో ఎన్నికల నిర్వహణపై నీలినీడలు అలముకున్నాయి. ఏకంగా జిల్లా కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీతో సహా జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లలో పనిచేసే ఇద్దరు ఎస్పీలు, మరో డివిజన్‌లో పనిచేసే సీఐలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న ఎస్ఈసీ సూచన అధికారుల్లో గుబులు రేపుతోంది. ఓ వైపు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం.. మరోవైపు కీలక అధికారులు ఎన్నికలకు దూరం కావాల్సి రావడంతో అధికారులకు సంకటంగా మారుతోంది.

మరోవైపు.. చిత్తూరు జిల్లాలో 41.74 లక్షల మంది జనాభా ఉన్నారు. 10.40 లక్షల కుటుంబాలున్నాయి. మొత్తం 1493 గ్రామాలుండగా.. 1363 మైనర్, మీడియం, మేజర్ గ్రామ పంచాయితీలున్నాయి. 66 మండలాల్లో ఒకటి పూర్తి అర్బన్ కాగా మిగిలిని 65 మండలాలు రూరల్ మండలాలుగా ఉన్నాయి. ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ మేరకు జిల్లాలో మొదటి విడతగా ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రాంతాల్లో హడావుడి నెలకొంది. అయితే నోటిఫికేషన్ అనుసరించి నామినేషన్ దాఖలు చేయాలంటే పని చేయాల్సిన అధికారుల్లో సందిగ్ధత ఇంకా తొలగలేదు. అటు.. జిల్లా పాలనాధికారి వ్యవహారంపైనే ఇంకా స్పష్టత లేదు. దీంతో ఆప్షన్ ఏంటి అన్న ఆలోచన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇక.. రేపటి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది కూడా ఊహకందని విషయం. అయినప్పటికీ.. మొదటి విడత పంచాయితీ ఎన్నికల హడావుడి మాత్రం జిల్లాలో మొదలైంది. రాష్ట్రమంతా ఒకరకమైన ఉంత్కంఠ నెలకొంటే.. చిత్తూరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని చెప్పాలి. ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారుల పరిస్థితి ఏంటో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇక.. చిత్తూరు పంచాయితీ పోరుపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories