వైసీపీ ఎమ్మెల్యే విశ్వరాయ కళావతి ఇంట విషాదం

వైసీపీ ఎమ్మెల్యే విశ్వరాయ కళావతి ఇంట విషాదం
x
Highlights

పాలకొండ ఎమ్మెల్యే విశ్వరాయ కళావతి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి మాజీ ఎంపీ, రాజకీయ కురువృద్ధుడిగా, గిరిజన నాయకుడిగా ఎంతో పేరుగాంచిన విశ్వరాయ...

పాలకొండ ఎమ్మెల్యే విశ్వరాయ కళావతి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి మాజీ ఎంపీ, రాజకీయ కురువృద్ధుడిగా, గిరిజన నాయకుడిగా ఎంతో పేరుగాంచిన విశ్వరాయ నరసింహరావుదొర(95) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె కుమార్తె, పాలకొండ ఎమ్మెల్యే విశ్వరాయ కళావతి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తండ్రి పార్థివదేహంపై పడి గుండెలలిసేలా రోధించారు. పేదల పెన్నిధిగా, గిరిజనుల అభ్యున్నతకి ఎనలేని కృషి చేశారు ఆయన. 1956లో వండవ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 1967లో అప్పటి పార్వతీపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అనంతరం 1972లో కొత్తూరు శాసనసభ సభ్యునిగా మరోసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. 1978లో జనతాపార్టీలో చేరి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఆ తరువాత 1985లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. అంతేకాదు ఒక పర్యాయం గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌గా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, వండవ, వీరఘట్టం సొసైటీ అధ్యక్షునిగా 40 ఏళ్ల సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో కొనసాగారు. ముఖ్యంగా గిరిజనుల అభివృధ్ధికోసం ఆయన ఎన్నో చేశారు. ఆరోజుల్లో గిరిజనులు చదువుకోవడానికి సరిగా స్కూల్స్ లేవు ఆయన హయాంలోనే గిరిజన తండాలు, గ్రామాల్లో విద్యాలయాలు మంజూరు చేయించారు. అంతేకాదు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న గిరిజనుల కోసం ఆసుపత్రులు కట్టించారు. ఆయన వారసురాలిగా కళావతి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సర్దార్‌ గౌతు లచ్చన్న, గొర్లె శ్రీరాములనాయుడు ఆయనకు రాజకీయ గురువులు. నరసింహరావుదొర మృతికి మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories