అప్పడు ఏమి చేశావు.. నాలుగు నెలల్లోనే అన్నీ చేస్తారా? : వైసీపీ నేత

అప్పడు ఏమి చేశావు.. నాలుగు నెలల్లోనే అన్నీ చేస్తారా? : వైసీపీ నేత
x
Highlights

అప్పడు ఏమి చేశావు.. నాలుగు నెలల్లోనే అన్నీ చేస్తారా? : వైసీపీ నేత అప్పడు ఏమి చేశావు.. నాలుగు నెలల్లోనే అన్నీ చేస్తారా? : వైసీపీ నేత

సమస్యలు పరిష్కరించలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లు మున్సిపల్ ఆఫీసులోనే నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నిరసనపై తీవ్రంగా మండిపడ్డారు పాలకొల్లు వైఎస్సార్‌సీపీ ఇంచార్జి కవురు శ్రీనివాస్‌.. టీడీపీ పాలనలో డ్రైనేజీలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుతం వ్యాధులు ప్రబలుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో కూడా రామనాయుడే ఎమ్మెల్యేగా ఉన్నారని.. అప్పుడు ఈ సమస్యను పరిష్కరించకుండా.. తమ ప్రభుత్వం ఏర్పడిన కేవలం నాలుగు నెలల్లోనే ఏమి చేయలేదని అనటం సరికాదన్నారు.

తమరి ప్రభుత్వ హయాంలో దోమలపై దండయాత్ర పేరుతో నిధుల దోపిడీ చేయడం తప్ప ఒక్క పనీ అయినా చేశారా అని విమర్శించారు. కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. అలాంటిది తమ ప్రభుత్వం రూ. 25 లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. మీరు అధికారంలో ఉండి ఏమి చేయకుండా.. నాలుగునెలల్లోనే అసలేం చేయలేదని అనడంలో అర్ధం ఏమిటన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే రామానాయుడు చేసిన తప్పులను ప్రజల్లో ఎండగడతామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories