విజయనగరంలో ప్రారంభమైన పైడితల్లి సిరిమానోత్సవం

Paidithalli Sirimanostavam Started in Vizianagaram
x

విజయనగరంలో ప్రారంభమైన పైడితల్లి సిరిమానోత్సవం

Highlights

Vizianagaram: ఈరోజు మొదలైన పైడితల్లి జాతర, రేపు సిరిమానోత్సవం

Vizianagaram: భక్తుల ఆపదమొక్కులు, డప్పుల వాయిద్యాలు... వేపాకు తోరణాలు.. పోతులరాజుల పదనర్తనలు నడుమ విజయనగరంలో సిరిమానోత్సవ సందడి నెలకొంది. ప్రతియేటా నిర్వహించే ప్రాంతీయ పండుగ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సమైక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఉత్తరాంద్ర ఆరాధ్య దైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి జాతర ఏర్పాట్లతో ప్రత్యేక వాతావరణం చోటుచేసుకుంది. రెండు రోజులపాటు జరిగే సిరిమానోత్సవ సంబరాలు ఈరోజే మొదలుకానున్నాయి.

విజయనగాన పైడితల్లి అమ్మవారు సర్వాలంకార శోబితురాలై భక్తులకు దర్శనమివ్వనున్నారు. పైడితల్లి అమ్మవారి దర్శనంకోసం తెలుగురాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఒడి‎శా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని సిరిమానోత్సావాన్ని తిలకిస్తారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని మొక్కులను తీర్చుకుంటారు. పైడిత్లల్లి అమ్మవారి జాతర సందర్బంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఎర్పాటు చేశారు. అమ్మవారి జాతర ఉత్సవాల్లో పాల్గొనేందుకు చేరుకున్న బంధువులతో విజయనగరవాసుల ఇళ్లల్లో సందడి నెలకొంది.

పూసపాటి వంశీయుడు అశోక్‌ గజపతిరాజు సోమవారం పైడితల్లిని దర్శించుకోనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని పైడితల్లి ఉత్సవాల్లో సిరిమానుకే ఒక ప్రత్యేకత ఉంది. లక్షలాది మంది సిరిమానును సందర్శించి భక్తిప్రపత్తులతో పూజలు చేస్తారు. సిరిమానోత్సవానికి ముందురోజు తొలేళ్లు నిర్వహిస్తారు. తొలి ఏరే తొలేళ్లగా మారింది. ఏరు అనగా నాగలి. తొలేళ్ల నాడు రాత్రి ప్రధాన పూజారి వెంకటరావు రైతులకు విత్తనాలు అందిస్తారు. వాటిని పొలాల్లో చల్లి నాగలితో భూమాతను తాకితే పంటలు సమృద్ధిగా పండుతాయనేది అనాదిగా వస్తున్న విశ్వాసం. తొలేళ్ల ఉషోదయం నుంచే పట్టణంలో పండగ సందడి నెలకొంటుంది. బంధువులు, స్నేహితులతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. ఉదయం 6 గంటల నుంచి బారులు తీరిన వరుసల్లో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లిస్తారు. రాత్రి 9 గంటలకు హుకుంపేట నుంచి ఘటాలు ఆలయానికి వస్తాయి. మేళతాళాలతో ఊరేగింపుగా అమ్మవారి పుట్టిల్లు కోటకు తరలిస్తారు. రాజవంశీయుల అర్చనల అనంతరం ఆ ఘటాలను తిరిగి ఆలయానికి తెస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories