బోటు వెలికితీతలో పురోగతి...బోటు పైకప్పును బయటికి తీసిన ధర్మాడి బృందం

బోటు వెలికితీతలో పురోగతి...బోటు పైకప్పును బయటికి తీసిన ధర్మాడి బృందం
x
Highlights

-బోటు వెలికితీతలో మరింత పురోగతి -బోటు పైకప్పును బయటికి తీసిన ధర్మాడి బృందం -40 అడుగుల లోతులో బోటు ముందు భాగం

రాజమండ్రి కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటు వెలికితీతలో ధర్మాడి బృందం మరింత పురోగతి సాధించింది. వారంరోజులుగా గోదావరిలో లంగరేసి బోటును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తోన్న ధర్మాడి బృందం మొన్న రెయిలింగ్‌ను బయటికి తీయగా, ఇప్పుడు బోటు పైకప్పును పైకి లాగారు.

గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడం మరోవైపు సుడిగుండాలు లేకపోవడంతో ధర్మాడి బృందం ఆపరేషన్ సత్ఫలితాలు ఇస్తోంది. అలాగే గోదావరి నీటి మట్టం 40 అడుగుల స్థాయిలోనే ఉండటంతో బోటును వెలికి తీసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

అయితే, బోటు ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటే వెనుక భాగం మాత్రం 70 అడుగుల లోతులో కూరుకుపోయిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు బోటులోకి పెద్దఎత్తున ఇసుక చేరడంతో బరువు పెరిగిందని, దాంతో పైకి లాగడం కష్టతరంగా మారిందని అంటున్నారు. దాంతో బోటుకి ఎక్కడ రోప్‌ తగిలిస్తే బయటికి తీయొచ్చనే దానిపై ధర్మాడి బృందం అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories