ఏపీలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఆ ఇద్దరికీ ఆహ్వానం

ఏపీలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఆ ఇద్దరికీ ఆహ్వానం
x

సోము వీరాజు ఫైల్ ఫోటో 

Highlights

ఏపీలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

ఏపీలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. ఇతర పార్టీల్లోని పెద్ద తలకాయలకు వల వేస్తోంది. గతంలో వాణీవిశ్వనాథ్‌ను పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ నేతలు.. తాజాగా.. కాపు ఉద్యమనేత ముద్రగడను కలిశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు.. ముద్రగడను కలిశారు. బీజేపీలో జాయిన్‌ కావాలని ఆహ్వానించారు. అయితే.. బీజేపీలో చేరికపై ముద్రగడ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కిమిడి కళా వెంకట్రావు, పడాల అరుణను సైతం సోము వీర్రాజు కలుస్తారని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి వారితో చర్చించే అవకాశం ఉంది. సోము వీర్రాజు మా ఇంటికి వస్తారని తనకు సమాచారం కూడా లేదన్నారు కళా వెంకట్రావు. టీడీపీలో కొనసాగుతానని స్ఫస్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories