ఏపీలోని ఆలయాల్లోకి భక్తుల అనుమతికి మార్గదర్శకాలు సిద్ధం..

ఏపీలోని ఆలయాల్లోకి భక్తుల అనుమతికి మార్గదర్శకాలు సిద్ధం..
x
Highlights

నాలుగో దశ లాక్ డౌన్ ఈరోజుతో ముగుస్తుంది. రేపటి నుంచి లాక్‌డౌన్‌ 5.0 జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

నాలుగో దశ లాక్ డౌన్ ఈరోజుతో ముగుస్తుంది. రేపటి నుంచి లాక్‌డౌన్‌ 5.0 జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ సారి సడలింపుల్లో భాగంగా రాష్ట్రంలోని ఆలయాల్లో గంటకు 300 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై దేవాదాయ శాఖ పలు మార్గదర్శకాలను సిద్ధం చేసి వైద్యారోగ్య అనుమతి కోసం పంపింది. దర్శనాలు వచ్చే భక్తులను అంతరాలయంలోకి ప్రవేశం లేకుండా కేవలం లఘు దర్శనానికే మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మార్గదర్శకాలు వైద్యారోగ్య శాఖకు పంపింది. వైద్య ఆరోగ్య శాఖ వీటిని ఆమోదించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.

దేవాదాయ శాఖ మార్గదర్శకాలు:

* భక్తులు ముందుగానే బుక్‌ చేసుకుంటే టైమ్‌ స్లాట్‌ దర్శనం కేటాయింపు

* దర్శన సమయాలను స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయించాలి.

* దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడూ గుర్తింపు కార్డు తప్పనిసరి

* ఆలయాల సమీపంలోని పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతి లేదు.

* నిత్య కళ్యాణం, రాహు, కేతు పూజలు, వ్రతాలు, హోమాలు తదితర క్రతువులకు సంబంధించి గతంలో అనుమతించే భక్తుల సంఖ్యలో 30 శాతం మందినే అనుమతి

* కాటేజీల్లోని ఒక గదిలో ఇద్దరు బస చేసేందుకు మాత్రమే అనుమతివ్వాలి.

* భక్తులకు ఒక గది వదిలి మరొకటి చొప్పున ఉన్నవాటిలో మొత్తం 50 శాతం గదులనే కేటాయించాలి.

* కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించే దగ్గర క్షురకులు ప్రతిసారీ జాగ్రత్తలు తీసుకోవాలి.

* అన్నదానం ప్రసాదం, నిత్యాన్నప్రసాదం ఉండదు.

* ఆలయ ప్రాంగణంలోని దుకాణాలను ఒకదాన్ని విడిచి మరోటి తెరిచేందుకు అనుమతివ్వాలి.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories