ఏపీ రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.25 మాత్రమే.. కానీ..

ఏపీ రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.25 మాత్రమే.. కానీ..
x
Highlights

ఉల్లి లేని వంట.. వంటే కాదంటారు.. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి ధర ఆకాశాన్నంటింది. కేజీ ఉల్లిపాయల ధర రూ.100 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు,...

ఉల్లి లేని వంట.. వంటే కాదంటారు.. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి ధర ఆకాశాన్నంటింది. కేజీ ఉల్లిపాయల ధర రూ.100 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వినియోగదారుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం రెండు నెలల కిందట కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.25కే విక్రయించేలా చర్యలు చేపట్టింది. కానీ ఇలా ప్రారంభించినా ఇంకా కొరత ఉంది. దాంతో ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు జనం ఎగబడుతున్నారు. అయితే ఇందుకు కారణం వినియోగదారులు ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలను కొనుగోలు చేయడమే..

ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను మాత్రమే ఇస్తున్నా.. కొందరు వేరే కుటుంబసభ్యులతో మళ్ళీ మళ్ళీ వస్తున్నారు.. అలా చేయడం వలన వేరొకరికి అందడం లేదు. ఇక కిలో ఉల్లి రూ.25కే విక్రయిస్తుండడంతో ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల అదనపు భారం పడుతోంది. మరోవైపు క్వింటాల్‌ ఉల్లి ధర ఆల్‌టైమ్ గరిష్ఠంగా రూ .6,470 ను తాకింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక ధర. అధిక ధర రైతులకు ఉత్సాహాన్ని కలిగించగా, వినియోగదారులకు మాత్రం ఇబ్బందిగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పంట నష్టం కారణంగా భారీగా ఉల్లిపాయల ధర పెరిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories