పార్టీ మారడంపై స్పష్టత ఇచ్చిన టీడీపీ నేత మాగుంట

పార్టీ మారడంపై స్పష్టత ఇచ్చిన టీడీపీ నేత మాగుంట
x
Highlights

గతకొంత కాలంగా ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరి ఒంగోలు లోక్ సభకు పోటీ చేస్తారని...

గతకొంత కాలంగా ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరి ఒంగోలు లోక్ సభకు పోటీ చేస్తారని జిల్లావ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. దీంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రూమర్లకు వివరణ ఇచ్చారు.. తహాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోనని తెలిపారు.

తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకూ ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటానని. ఇదే ఆదరాభిమానాలను రాబోయే ఎన్నికల్లోనూ చూపించి నన్ను గెలిపించండి అంటూ క్యాడర్ కు క్లారిటీ ఇచ్చేశారు. కాగా ఒంగోలులో శనివారం పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ విషయాలపై స్పష్టత ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన పింఛన్‌దారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories