రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మద్య నిషేధం : మంత్రి బాలినేని

రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మద్య నిషేధం : మంత్రి బాలినేని
x
Highlights

ఎన్నికలలో జగన్ హామీ ఇచ్చిన మద్యనిషేదం హామీని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాలుగేళ్లలో దీనిని పూర్తి స్తాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే...

ఎన్నికలలో జగన్ హామీ ఇచ్చిన మద్యనిషేదం హామీని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాలుగేళ్లలో దీనిని పూర్తి స్తాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు చేశారు. దీనిలో భాగంగానే అధికారం చేపట్టిన వెంటనే ఒకసారి, ఈ నెల ప్రారంభంలో మరోసారి షాపులు తగ్గించారు. దీంతో పాటు పేదలు మద్యానికి దూరం కావాలని ధరలు సైతం వంద శాతం పెంచారు. ఈ విధంగా మద్యనిషేదం అమల్లో ముందుకు పోతున్న జగన్ ప్రభుత్వం తాజాగా రాష్ట్ర డ్రగ్‌ డీ ఎడిక్షన్‌ సెంటర్‌ లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా మంత్రి బాలినేని ఒంగోలులో తాజాగా ఈ సెంటర్ను ప్రారంభించారు.

మరో రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామని విద్యుత్‌, అటవీశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖా త్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌లో)లో ఆయన డ్రగ్‌ డీ ఎడిక్షన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతుందని, నాలుగో ఏడాది పాలన మొదలు కాగానే పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా మద్య విక్రయాలను నియంత్రిస్తున్నామన్నారు. మద్యానికి బానిసలై మానసిక స్థితి దెబ్బతిన్న వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ వ్యసన విముక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జీజీహెచ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారానికి, కొత్త విభాగాల ఏర్పాటుకు వైద్యశాఖ మంత్రితో చర్చిస్తామని తెలిపారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ డ్రగ్‌ డీ ఎడిక్షన్‌ సెంటర్‌ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.37.27 లక్షలు విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం 15 పడకలతో ప్రారంభమైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిమ్స్‌ సూపరింటెండెంట్‌ శ్రీరాములు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ రాజనమన్నార్‌, ఆర్‌ఎంవో వేణుగోపాలరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ మురళికృష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories