Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ రగడ

ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ రగడ
Andhra Pradesh: చలో విజయవాడ విజయవంతం కావడంతో ప్రభుత్వంలో ఆందోళన
Andhra Pradesh: ఏపీలో ఉద్యోగుల ఉద్యమం పోలీసులకు తలనొప్పిగా మారింది. గురువారం జరిగిన చలో విజయవాడకు పోలీసుల సహకారం ఉందని బహిరంగంగానే ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు పోలీసుల నెక్స్ట్ ప్లానేంటి.. ఒకవేళ సమ్మె సైరన్ మోగితే పోలీసులు మళ్ళీ సహకరిస్తారా..?
ఉద్యోగ సంఘాల పిలుపుతో జరిగిన చలో విజయవాడకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉద్యోగులు తరలివచ్చారు. పోలీసులు ముందుగానే బారికేడ్లు, వందకు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఫాల్కన్ వాహనాలు సిద్ధం చేసారు. మరోవైపు వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసామర్థ్యం ఉండే ప్రదేశాలు, టిఫిన్ సెంటర్లు సైతం జల్లెడపట్టారు. బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం స్క్రీనింగ్ చేశారు.
అయితే ఒక్కసారిగా లక్షమంది అన్ని వైపుల నుంచీ బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకోవడం చూసి, బ్యారికేడ్లు కూడా ఆపలేవని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఉన్న ఫోర్స్ 2500 మంది.. మహా అయితే ఎంతమందిని అదుపుచేస్తారు. కానీ వచ్చిన వాళ్ళు మూడున్నర కిలోమీటర్ల మేర నిండిపోయారు. బీఆర్టీఎస్ రోడ్డు ఒక ఉద్యోగుల సముద్రంలా తయారయింది. దాంతో పోలీసులు చేతులెత్తేసారని టాక్. కానీ పోలీసులే అందరిని బీఆర్టీఎస్ రోడ్డుకు వచ్చేందుకు సహకరించారట. ఆ మాటలు ఏకంగా ఉద్యోగ సంఘాల నాయకులే బహిరంగంగా మైకుల్లో చెప్పారు. చివరకు మైకు కూడా పోలీసులే ఇచ్చారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి జరిగే నిరసనలకు పోలీసుల సపోర్టు ఉంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోలీసులూ ఉద్యోగులే.. సరాసరి సమ్మెకు దిగలేకపోవచ్చు కానీ.. సమ్మెకు అజ్ఞాతం నుంచి సపోర్టు చేయచ్చని కొందరు అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం బందోబస్తు చేయకతప్పదు. మరోవైపు పోలీసుల సహకారం తమకు ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
కృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMTT-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
28 Jun 2022 2:30 PM GMT