logo
ఆంధ్రప్రదేశ్

కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న పులివేట

Ongoing Poaching in Kakinada District
X

కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న పులివేట

Highlights

Kakinada: *ప్రత్తిపాడు మండలంలోనే సంచరిస్తున్న పెద్దపులి

Kakinada: కాకినాడ జిల్లాలో పులి వేట కొనసాగుతోంది. గత 24రోజులుగా చిక్కకుండా తిరుగుతున్న పులి అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా ప్రత్తిపాడు మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతున్న పులిని.. వేటాడి పట్టుకోవడమే సరైందని అటవీశాఖ వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వు నుంచి నిపుణులు వస్తారని తెలుస్తోంది. ఈ టీమ్ నేరుగా పులి ఉన్న ప్రదేశాలకు వెళ్లి గాలింపు చేపడతారు. పులి సంచరిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ట్రాంక్వి లైజర్ గన్లతో పులిని స్పృహ తప్పించి పట్టుకోవడంలో ఈ బృందం సిద్ధహస్తులని చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు.

Web TitleOngoing Poaching in Kakinada District
Next Story