విశాఖలో మరో స్టీల్ ప్లాంటు.. ముందుకొచ్చిన రెండు సంస్థలు..

విశాఖలో మరో స్టీల్ ప్లాంటు.. ముందుకొచ్చిన రెండు సంస్థలు..
x
Highlights

విశాఖ వాసులకు త్వరలో మరో శుభవార్త వెలువడనుందా? అక్కడ మరో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కాబోతుందా? వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి దొరకనుందా? అంటే అవుననే...

విశాఖ వాసులకు త్వరలో మరో శుభవార్త వెలువడనుందా? అక్కడ మరో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కాబోతుందా? వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి దొరకనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశాఖపట్నంలో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌), కొరియాకు చెందిన పోస్కో సంస్థలు సంయుక్తంగా స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి లేక రాసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులతో ఈ ద్వయం చర్చలు జరుపుతోంది. భూమి కేటాయిస్తే త్వరలో రూ.20 వేల కోట్లతో విశాఖలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూములు ఇప్పటికే ఉన్న ఉక్కు పరిశ్రమ వద్ద అందుబాటులో ఉన్నాయి. విశాఖలో పోర్టు ఉండటం మూలాన అక్కడ ప్లాంటు ఏర్పాటు చేస్తే అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఉంటుందని పోస్కో సంస్థ భావిస్తోంది. ఈ కారణంతోనే ఇక్కడ మరో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చెయ్యడానికి సిద్ధమైంది. ప్లాంటు ఏర్పాటతె దాదాపు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

అయితే ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంటు ఉంది.. దీంతో రోజు రోజుకు కాలుష్యం కూడా ఎక్కువైతోంది. ఈ క్రమంలో మరో స్టీల్ ప్లాంటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తాయా? అన్న సందేహం నెలకొంది. అంతేకాకుండా ఎక్కడైతే ఈ ముడిసరుకు విక్రయం జరుగుతుందో ఆ ప్రాంతానికే పన్ను చెందుతుంది.. కాబట్టి రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం పెద్దగా ఉండదు.. పైగా కాలుష్యాన్ని భరించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరోవైపు కడపలో కూడా ప్రస్తుతం స్టీల్ ప్లాంటు నిర్మాణం జరుగుతోంది. మూడేళ్లలో దీని నిర్మాణం పూర్తి కానుంది. దేశంలో 2018 నాటికి ఉక్కు పరిశ్రమ సామర్ధ్యం ఒక కోటి నాలుగు లక్షలు.. కానీ ప్రస్తుతం దేశానికీ మూడు కోట్ల టన్నులు అవసరముంది.. అందులో 30 లక్షల సామర్ధ్యం కడప నుంచే రాబోయే రోజుల్లో వస్తుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.15 వేల కోట్లతో ఈ కర్మాగారం నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories