చింతమనేనికి మరో షాక్..

చింతమనేనికి మరో షాక్..
x
Highlights

చింతమనేనికి మరో షాక్.. చింతమనేనికి మరో షాక్.. చింతమనేనికి మరో షాక్..

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వరుస కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టై ఏలూరు జైల్లో రిమాండ్ లో ఉన్న చింతమనేని ప్రభాకర్ ను మరో కేసులో కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. పీటీ వారెంట్‌పై చింతమనేనిని పోలీసులు కోర్టులో హాజరుపర్చినట్టు తెలుస్తోంది. దివ్యాంగుడు అయిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించాడని చింతమనేనిపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను ఏలురులోని జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

2018లో ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని వద్దకు వెళ్లిన ఓ దివ్యాంగుడు తనకు న్యాయం చేయాలని కోరగా అతనిపై దాడి చేసిన ఘటన అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో జిల్లా మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆయనకు వచ్చే నెల 10 వరకు రిమాండ్ విధించారు. ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్ట్ అయి ఈ నెల 11 నుంచి ఏలూరు సబ్ జైల్లో చింతమనేని ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories