ఆ రోజు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ : టీటీడీ చైర్మన్

ఆ రోజు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ : టీటీడీ చైర్మన్
x
Highlights

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం...

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్బంగా గవర్నర్ కు టీటీడీ క్యాలెండర్, శ్రీవారి ప్రసాదం ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, తిరుమలలో సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికీ శ్రీవారి దర్శనం సాకారం కావడానికి చర్యలు తీసుకుంటారు. నూతన సంవత్సరంలో మంచి వర్షాలు కురుస్తాయని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదది రోజు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ఇస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలతో సీఎంకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తోందని అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను జీర్ణించుకునే మానసిక స్థితిలో టీడీపీ లేదని.. అందువల్లే రైతుల పేరిట క్యాపిటల్ డ్రామా చేయిస్తుందని అన్నారు.

అమరావతిలో బినామి పేర్లతో భూములు కొన్న చంద్రబాబు వాటి విలువ పడిపోతుందనే భయంతో కుట్ర రాజకీయాలకు తెరలేపారని వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని రెండు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తుంటే.. చంద్రబాబు దానిని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని.. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. హై పవర్ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత రాజధానిపై నిర్ణయం ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories