చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం..

చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం..
x
Highlights

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు వద్ద బాలాజీ కల్యాణ మండపం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా , నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి....

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు వద్ద బాలాజీ కల్యాణ మండపం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా , నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా తమిళనాడులోని వెల్లూరు జిల్లా వాలాజపేట తాలూకాకు చెందిన వారు. మృతుడు హరికృష్ణ గా గుర్తించారు. హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఇతర ప్రముఖ దేవాలయాలలో దర్శనం చేసిన తరువాత కుటుంబం తిరిగి వెల్లూరుకు పయనమైంది. పూతలపట్టు చేరుకోగానే, కుటుంబం ప్రయాణిస్తున్న కారు తమిళనాడు నుండి తిరుమల వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న హరికృష్ణ (32) మరణించాడు.

అతని తల్లి వల్లియమ్మ (60), భార్య ప్రియా (21), బావమరిది రేణుక (17), రేవతి (17), రాధా (36), అభినయ (10) లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో, రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ దగ్గర జరగడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులను 108 అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందాడు. వల్లియమ్మ, రేవతి పరిస్థితి విషమంగా ఉందని, ప్రథమ చికిత్స తర్వాత వారిని వెల్లూరు సిఎంసికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories