ఎస్‌ఈసీతో కలెక్టర్ల సమావేశం మరోసారి రద్దు

X
Highlights
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించొద్దని సీఎస్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడింది.
admin19 Nov 2020 7:49 AM GMT
ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో కలెక్టర్ల సమావేశం మరోసారి రద్దయింది. కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు, నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించొద్దని సీఎస్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ వాయిదా పడింది. మొదట కలెక్టర్లతో సమావేశం నిన్ననే నిర్వహించాల్సి ఉండగా.. వీడియో కాన్ఫరెన్స్‌పై క్లారిటీ రాకపోవడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. కలెక్టర్లతో సమావేశం నిర్వహించొద్దని సీఎస్ చెప్పడంతో.. ఇవాళ జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ కూడా రద్దయ్యింది.
Web Titleonce again canceled Collectors' meeting with SEC
Next Story