Top
logo

Palamaner: వలసకూలీలను ఇంటికి పంపేందుకు అధికారులు ఓకే

Palamaner: వలసకూలీలను ఇంటికి పంపేందుకు అధికారులు ఓకే
Highlights

పలమనేరు: కలెక్టర్ ఆదేశాల మేరకు పలమనేరు బార్డర్ ప్రాంతానికి వచ్చిన వలస కార్మికులు, మొత్తం పలమనేర్ బిసి...

పలమనేరు: కలెక్టర్ ఆదేశాల మేరకు పలమనేరు బార్డర్ ప్రాంతానికి వచ్చిన వలస కార్మికులు, మొత్తం పలమనేర్ బిసి హాస్టల్లో ఉన్న 64 మంది, కర్ణాటక నుండి ఆంధ్రా సరిహద్దుకి వచ్చిన 1500 మంది, మొత్తం 1564 మందిని వారి సొంత జిల్లాలకు పంపడానికి నిర్ణయించుకున్నారు. కావున వీరిని తమ స్వంత జిల్లాలకు పంపడం కొరకు 48 బస్సు లను ఏర్పాటు చేస్తున్నట్లు పలమనేరు తహసీల్దార్ శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు. కరోనా వైరస్ లేదని నిర్ధారించిన తర్వాతే నేనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


Web TitleOfficials Permit daily labors to go to their home town in Palamaner
Next Story